బంగాళాఖాతంలో తుపాను ముప్పు నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని హైఅలర్ట్‌లో ఉండాలని ఆదేశించడం జరిగింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశాను.
భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ఈ ఐదు రోజులు ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. బీచ్‌లకు వెళ్లడం, ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు దిగడం మానుకోవాలి. అధికారిక హెచ్చరికలను అనుసరించాలి, అపోహలను నమ్మవద్దు. ప్రజల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత.