Bhakthi TV by Rachana Television P.Ltd. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

Jubilee Hills Sri Peddamma Thalli darshan on auspicious Vijayadasami🙏🕉️ Devi Navaratri 2026 20th October, Tuesday #BhakthiTV #PeddammaTemple #Hyderabad #Dasara #DeviNavratri
1
6
48
562
దేవీ నవరాత్రులు... విజయదశమి శుభవేళ... భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారములో భక్తులకు దర్శనం 🕉️🙏 Sri Mavullamma Temple, Bhimavaram Devi Navaratri Mahotsavam-2026 20-10-2026 #BhakthiTv #Dasara #Bhimavaram
1
8
60
545
రాజరాజేశ్వరి దేవి కటాక్షం కోసం ఈ ధ్యాన శ్లోకం తప్పక చదవండి #Mantrabalam #BhakthiTV
1
225
జమ్మి చెట్టుకు దసరా పండుగకు ఉన్న సంబంధం ఏమిటి? #Shubhadinam #BhakthiTV
3
261
తిరుమల: 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం.నిన్న శ్రీవారిని దర్శించుకున్న 85,431 మంది భక్తులు.నిన్న తలనీలాలు సమర్పించిన 22,966 మంది భక్తులు.నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.2 కోట్లు. #TTD #Tirumala #BhakthiTV
1
11
361
నేడు ఇంద్రకీలాద్రిపై విజయదశమి వేళ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా జగన్మాత దర్శనం.ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం.ఉదయం 10:30కు దసరా ఉత్సవాల మహా పూర్ణాహుతి.మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య అమ్మవారిని దర్శించుకోనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. సాయంత్రం కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం. #indrakeeladri #vijayawada #BhakthiTV
1
7
49
566
దినఫలం #DailyHoroscope #BhakthiTV
1
4
354
కాలచక్రం #DailyHoroscope #BhakthiTV
1
1
299
రావణ దహనం : నవరాత్రి పర్వదినాలు చివరి దశకు చేరాయి. ఎక్కడ చూసినా దసరా కోలాహలమే. భారతావనిలో దసరా ఒక ముఖ్యమన పండుగ. దసరా పండుగనాడు దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడానికి కారణం ఏమిటంటే దాని వెనుకో కథ ఉంది. శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడట. అందుకే ఈ రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది. మహార్నవమి నాడు శ్రీరామ చంద్రుడు దుర్గాదేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీ పూజ చేశారు. నాటి నుండి అశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులను పదవ రోజున విజయదశమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాముడు రావణుని మీదకు దండు వెడలిన దినం విజయదశమి అని పండితులు చెబుతుంటారు. రావణ దహనం వెనుక మరో పరమార్థం ఏమిటంటే రోజు రోజుకీ స్త్రీలపై అత్యాచారాలు పెరగిపోతున్న ఈ రోజుల్లో పర స్త్రీని తల్లిలా పూజించాలని, లేనిచో రావణుడిలాగా ఏదో ఒక రోజు పాపం పండి దహించుకుపోతారని కావున మనిషిలోని కామ, క్రోధ, మద, మాత్సర్యాలను నశింప చేసుకోవాలని రావణ దహనం సందేశం ఇస్తుంది. #BhakthiTV
1
6
26
571
షిర్డీసాయి సమాధి ఉత్సవం : నా చరితం తెరిచిన పుస్తకం. ప్రతి పుటలో మానవ జీవన పరమార్థ సత్యం గోచరమవుతుంది. ప్రతి వాక్యంలో ఆధ్యాత్మిక ప్రబోధం కనిపిస్తుంది. ప్రతి అక్షరంలో నేను చిరునవ్వుతో అందర్నీ పలకరిస్తాను. ఆశీర్వదిస్తాను. నేను సూచించిన బాటలో మీరు పయనిస్తే మీ జీవితాలు చరితార్థమవుతాయి. మీరు పాటించే సమతా భావన... నాకు అసలైన ఆరాధన. సాటివారికి ప్రేమ, దయ, శాంతం, త్యాగం అందించడమే మీరు నాకు సమర్పించే నివేదన. నా మార్గాన్ని అవలంబించే వారికి సదా తోడుగా ఉంటుంది నా శుభదీవెన... అంటూ తన ప్రియభక్తులకు నిరుపమాన రీతిలో మార్గనిర్దేశనం చేసి, వెలుగుదారులు పరచిన ఆధ్యాత్మిక చైతన్యస్ఫూర్తి... మహాయోగ మూర్తి – షిర్డీసాయిబాబా ! విజయదశమి పర్వదినాన సాయి పుణ్యతిథిని షిర్డీలో వైభవోపేతంగా నిర్వహిస్తారు. మందిరాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. నాలుగురోజులపాటు కొనసాగే ఈ పుణ్యతిథి మహోత్సవానికి దేశ, విదేశాల నుంచి సాయి భక్తులు తరలివస్తారు. సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నాలుగు హారతులు, చందనోత్సవం వంటి నిత్యోత్సవాలను మరింత ఘనంగా, నేత్రపర్వంగా పరిఢవిల్లుతాయి. తమ ఆశలకు, ఆకాంక్షలకు, ఆశయాలకు అర్ధాన్నీ, పరమార్గాన్ని చూపే సాయీశ్వరుణ్ని దర్శించుకుని, సాయినాధునిలో తమ హృదయాన్ని అనుసంధానం చేసుకోవడానికి అత్యధికంగా భక్తులు విజయదశమి పర్వదినాన జరిగే సాయి పుణ్యతిథికి విచ్చేస్తారు. విరోధాలు, విభేదాలు, వైషమ్యాలు, వైరుధ్యాలు లేని సమాజస్థాపనే సాయి ఆకాంక్ష. ఆ సచ్చిదానంద సద్గురువు మనోభీష్టాన్ని నెరవేర్చడమే అసలైన సాయి ఆరాధన. #BhakthiTV
2
22
466
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సమాప్తం : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్పస్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. గరుడసేవ, హనుమంత వాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, రథోత్సవం వంటి ప్రధాన ఘట్టాలను భక్తులు పెద్ద సంఖ్యలో వీక్షించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. బ్రహ్మోత్సవాల చివరి రోజున నిర్వహించే చక్రస్నానం, ఇతర వైదిక కార్యక్రమాలతో ఉత్సవాలు సంపూర్ణమయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల అంతా గోవింద నామస్మరణతో మార్మోగగా, దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని పుణ్యఫలాన్ని పొందారు. #BhakthiTV
3
17
373
అలంపురం శ్రీ జోగులాంబ తెప్పోత్సవం : అలంపురం శ్రీ జోగులాంబ అమ్మవారి తెప్పోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే విశిష్టమైన ఆధ్యాత్మిక వేడుక. అలంపురం పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ జోగులాంబ అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి, తుంగభద్ర నదిలో సుందరంగా అలంకరించిన తెప్పపై జలవిహారం చేయిస్తారు. పూలు, దీపాలతో అలంకరించిన తెప్పపై అమ్మవారి దివ్యదర్శనం భక్తులకు కనువిందు చేస్తుంది. తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు అలంపురంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటారు. తుంగభద్ర నది పవిత్ర జలాల మధ్య జరిగే ఈ జలవిహారం అలంపురం క్షేత్ర మహాత్మ్యాన్ని, శ్రీ జోగులాంబ అమ్మవారి వైభవాన్ని చాటిచెబుతూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. #BhakthiTV
1
2
39
467
వరంగల్ శ్రీ భద్రకాళీ తెప్పోత్సవం : వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించే ఆధ్యాత్మిక వేడుక. భద్రకాళీ చెరువులో ప్రత్యేకంగా అలంకరించిన తెప్పపై శ్రీ భద్రకాళీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగిస్తూ జలవిహారం నిర్వహిస్తారు. పూలు, విద్యుత్‌ దీపాలతో అలంకరించిన తెప్పపై అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వరంగల్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అమ్మవారి అనుగ్రహంతో కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ భక్తులు ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహిస్తారు. శ్రీ భద్రకాళీ అమ్మవారి జలవిహారం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ వరంగల్‌ ప్రాంతపు భక్తి, సంప్రదాయ వైభవాన్ని చాటిచెబుతుంది. #BhakthiTV
5
39
565
ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ హంసవాహన తెప్పోత్సవం : దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమిరోజున ఇంద్రకీలాద్రి అధిష్ఠానదేవత శ్రీకనకదుర్గాదేవి, శ్రీమల్లేశ్వరస్వామివార్లకు కృష్ణానదిలో నిర్వహించే హంసవాహనసేవ కనులపండువుగా తిలకించడానికి లక్షలాది భక్తకోటి ఉవ్విళ్ళూరుతారు. ఈ జలవిహారాన్ని చూడముచ్చటైన వేడుకగా అభివర్ణించవచ్చు. తెప్పోత్సవంగా పిలిచే హంసవాహనసేవలో త్రిలోకసంచారానికి గుర్తుగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను పవిత్రకృష్ణానదిలో మూడుసార్లు ప్రదక్షిణలతో కూడిన జలవిహారము నిర్వహించబడుతుంది. తెప్పోత్సవం అనంతరం విజయవాడ నగర పోలీసు వారి ఆధ్వర్యంలో పురవీధులలో దేవదేవేరుల ఊరేగింపు, బ్రాహ్మణ వీధిలోని దేవస్థానం జమ్మిదొడ్డిలో శమీపూజ, పారువేటోత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించబడును. #BhakthiTV
2
15
402
అపరాజితాదేవి పూజ : అపరాజితాదేవి శక్తి రూపాలలో ఒకటి. అపరాజిత అంటే ఓడించడానికి అసాధ్యమైనది అని. అపరాజితాదేవి దేవ దానవ యుద్ధం లో సైన్యాధికారిణి. మహిషాసుర మర్దిని స్వరూపమైన ఆమెను పూజించినవారు సర్వత్రా విజయాలను పొందుతారు. శ్రీరాముడు రావణ యుద్ధానికి ముందు, పాండవులు కురుక్షేత్ర సంగ్రామ విజయం కొరకు అపరాజితా దేవిని పూజించారు. ఆమె శమీ వృక్షం (జమ్మి చెట్టు) లో ఉంటుందని భక్తుల విశ్వాసం. నవమి నాడుగానీ నవమి పాక్షికంగా ఉన్న దశమి నాడుగానీ అపరాజితాదేవి పూజకు శ్రేష్టమైన తిథి. ఈ తిథి నాడు సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు, స్నానాదికాలు ముగించుకుని, యథావిధిగా నిత్య పూజను చేయాలి. అపరాహ్న సమయంలో అంటే మధ్యాహ్నం నుండీ పొద్దువాలే మధ్యకాలం లో అపరాజితా పూజను చేయాలి. షోడశోపచార పూజ చేసి, అపరాజితా స్తోత్రాన్ని పఠించాలి. శమీవృక్షాన్ని పూజించాలి. అపరాజితా పూజను చేయడం వలన శత్రుబాధలు తొలగుతాయి. సర్వత్ర విజయం లభిస్తుంది. #BhakthiTV
6
44
503
శమీపూజ : శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ కరిష్యమాణయాత్రాయాం యథాకాలం సుఖం మయా తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామ పూజితే సృష్టికర్త ఒక్కొక్క వస్తువునే సృష్టిస్తూ అగ్నిని కూడా సృష్టించాడు. అగ్ని పుడుతూనే తన ప్రభావాన్ని చూపించి, ప్రజాపతికే సెగలు పుట్టించింది. అందుకాయన భయపడి అగ్నిని శమింపచేసేందుకు శమీవృక్షాన్ని సృష్టించాడు. దానికొమ్మలతో కొట్టి అగ్నిని శమింపచేశాడు. అగ్నిని తనలో నిలుపుకున్నందువల్ల జమ్మిచెట్టు అగ్నిగర్భ అయింది. యజ్ఞయాగాదులలో అగ్ని రగిల్చే అరణిని జమ్మి కర్రలతోనే చేస్తారు. రోజూ జమ్మిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తే శరీరంలో ఉష్ణశక్తి పెరుగుతుందంటారు. సీతావియోగ బాధను అనుభవిస్తున్న శ్రీరామచంద్రుడు జమ్మిచెట్టు కిందనే నవరాత్ర వ్రతం చేశాడు. అందుకే జమ్మిచెట్టు... రామస్య ప్రియదర్శిని, శ్రీరామ పూజిత అయ్యింది. శ్రీరాముని పూర్వీకుడైన రఘుమహారాజు కాలంనాడు. జరిగిన కథ శమీవృక్షం గొప్పతనాన్ని తెలియచేస్తుంది. రఘుమహారాజు కాలంలో ఆయన చేయవలసిన దానానికి గానూ కుబేరుడు అయోధ్యానగరంలో స్వర్ణవర్షం కురిపించాడు. అది ఆశ్వయుజ శుద్ధ దశమినాడు జరిగింది. జమ్మిచెట్టు రాష్ట్ర వృక్షంగా గల తెలంగాణ రాష్ట్రంలో జమ్మి ఆకులను బంగారంగా, ఆరె కొమ్మలను వెండిగా పంచుతూ పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకునే సంప్రదాయం ఉంది. ఈ కార్యక్రమాన్ని ‘సోనా దేనా' అని పిలుస్తారు. శతాబ్దాలుగా ఈ వేడుక ఐకమత్యానికి కూడా ప్రతీకగా నిలుస్తోంది. ఆంధ్రప్రాంతంలో జమ్మి ఆకులను సేకరించడానికి పార్వేట ఉత్సవం అని పేరు. జమ్మికొట్టుట అని కూడా అంటారు. భక్తులందరూ సమూహంగా తరలి వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. జమ్మి ఆకులను సేకరిస్తారు. శమీశమయతే పాపం... అనే శ్లోకం రాసిన కాగితాలను జమ్మిచెట్టుకు కడతారు. చెట్టు ఎక్కకుండా, కింద నుంచి అందిన ఆకులను తెంచుకుని వచ్చి, పెద్దలకు ఇచ్చి సమస్కరిస్తారు. #BhakthiTV
4
29
468
విజయదశమి : నవరాత్రి ఉత్సవాల పేరు వినగానే నూతనోత్తేజంతో మనసు ముప్పిరిగొంటుంది. భక్తి సమ్మిళితమైన ఉత్సాహ వాతావరణం ఆ తొమ్మిది రోజులూ ఉంటుంది. ఓ అద్భుత దివ్యానుభూతికి నిదర్శనమై నిలుస్తుంది. శరన్నవరాత్రుల్లో కనీసం మూడురోజులైనా దేవీపూజ చేస్తే ఏడాది మొత్తం దేవిని ఆరాధించిన ఫలం దక్కుతుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినుంచి దశమి వరకూ నిష్ఠగా దీక్షలు చేస్తారు. పాడ్యమి నుంచి నవమి వరకూ దీక్ష పాటించిన సాధకుడు చివరిరోజైన దశమి రోజు దీక్షను ముగిస్తాడు. ఈరోజు సాధకునికి సిద్ధి లభిస్తుంది. అందుకే ఇది విజయదశమి అయింది. ఈ పూజా విధానం మూడు దశల్లో సాగుతుంది. మొదటి మూడురోజులు దుర్గామాతను, మధ్య మూడురోజులు లక్ష్మీ దేవిని, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని ఆరాధిస్తారు. మరికొందరు సాధకులు తమ వీలును బట్టి మూడు, అయిదు, ఏడు రోజులు కూడా దీక్షగా తల్లిని పూజిస్తారు. ఎవరెలా ఎన్ని రోజులు పూజించినా అందరిలోనూ కావలసింది అమ్మమీద మనసును లగ్నం చెయ్యడం. ఆర్భాటాలతో ఎన్ని రోజులు పూజ చేసినా అణువంతైనా కదలని తల్లి ఆర్తితో, నిండైన భక్తితో నిమిషం చేసినా సాధకుని ముందుకు తరలి వచ్చి కోరినవి అనుగ్రహిస్తుంది. #BhakthiTV
4
25
636
శ్రీ రాజరాజేశ్వరీ దేవి : ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి), మంగళవారం, ది. 20-10-2026 అంబా శాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమాపార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ । సావిత్రీ నవయవ్వనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ॥ శరన్నవరాత్రి మహోత్సవములలో పదవరోజు శ్రీ కనక దుర్గాదేవి చిరునవ్వులతో శ్రీ రాజరాజేశ్వరిదేవి గా భక్తులకు దర్శనభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. చెరుకుగడను వామహస్తముతో ధరించి,దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్ఠానదేవతగా వెలుగొందే శ్రీరాజ రాజేశ్వరిదేవిని దర్శించి, అర్చించడం వలన సర్వ శుభములు కలుగుతాయి. దసరా ఉత్సవాల సంపూర్ణపుణ్యాన్ని అందరికీ అందింపచేసే అపరాజితాదేవిగా, చల్లనితల్లిగా శ్రీ కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యంచేసుకుందాము. సకలశుభాలు, విజయాలు శ్రీఅమ్మవారి దివ్యదర్శనం ద్వారా మనకు లభిస్తాయి. #BhakthiTV
1
12
86
875
అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దివ్య కటాక్షం🙏🕉️ కలిదోషాల నివారణ.. ధర్మరక్షణకు కల్కి అవతార సందేశం🙏 భక్తజనుల భజనలు, కోలాటాలు.. కర్పూర హారతులతో ఆధ్యాత్మిక వైభవం🙏 Srivari Navaratri Brahmotsavams, Tirumala 19-10-2026 #BhakthiTV #Tirumala #Navaratri #Brahmotsavams
2
34
591