Why only drinking water?
Isn't ground water equally precious ?! .
@MDHMWSSB
In Defence Colony, most roads are flooded with water from washing the porticos, ramps and parking areas with pipe water(either with ground water or drinking water).
.
@HMWSSBOnline
.
@hmwssbmgrdfncln
తాగునీటి దుర్వినియోగంపై జలమండలి కఠిన చర్యలు
==========================
# జూబ్లీహిల్స్‌లోని ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా
# తాగునీటి కనెక్షన్ తొలగింపు
# కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల సరఫరా కూడా నిలిపివేత
# నీటి వృథాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: జలమండలి
హైదరాబాద్ మహానగరంలో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ సర్కిల్, జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని రోడ్ నంబర్ 45, ప్లాట్ నంబర్ 872లో ఉన్న ఫోర్ ఫాదర్స్ పబ్ (Fore Fathers Pub)లో నీటి దుర్వినియోగానికి సంబంధించి అందిన ఫిర్యాదుపై జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల అనంతరం నీటి దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి, సదరు పబ్ యాజమాన్యానికి రూ.20 వేల జరిమానా విధించారు. అంతేకాకుండా తాగునీటి కనెక్షన్‌ను తొలగించడంతో పాటు జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అందించే నీటి సరఫరాను కూడా నిలిపివేశారు.
రానున్న వేసవిలో నీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర వాణిజ్య సంస్థలు తాగునీటిని వృథా చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.
నీటి దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలతో పాటు నీటి కనెక్షన్ల తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది.
నీటి దుర్వినియోగంపై సమాచారం అందించండి: జలమండలి విజ్ఞప్తి
=====================
తాగునీటి వృథా, దుర్వినియోగానికి సంబంధించిన ఘటనలు ప్రజల దృష్టికి వచ్చిన పక్షంలో, సంబంధిత ఫొటోలు, వీడియోలు, వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, ఘటన జరిగిన ప్రాంతం, పూర్తి చిరునామాతో సహా జలమండలి వాట్సాప్ నంబర్ 99499 30003 కు సమాచారం అందించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కస్టమర్ కేర్ నంబర్ 155313 ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపింది.
అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, ఉల్లంఘనలు నిర్ధారణ అయిన పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని జలమండలి హామీ ఇచ్చింది. తాగునీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరింది.