రేవంత్ CM గారు
మీకు ఒక చారిత్రాత్మక అవకాశం వచ్చింది. ఈ భూములను రాష్ట్రం లో విద్యను అభివృద్ధి చేయడానికి కేటాయించండి. ఈ మియాపూర్ భూములను నిజాయితీగా పారదర్శకంగా అమ్ముదాము. వచ్చిన 30,000 లేక 60,000 కోట్లను ఆర్ధిక శాఖ బయట పటిష్టమైన పారదర్శకమైన విధానం తో విద్యానిధి లో జమ చేద్దాం. మీకు ఇంకా రెండు సంవత్సరాలు టైం ఉంది. 1200 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు 1200 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లు ఆరుట్ల మోడల్ లో అభివృద్ధి చేద్దాం. 150 డిగ్రీ కాలేజీలు, 17 యూనివర్సిటీలు అభివృద్ధి చేద్దాం. విద్యను యూరోపియన్ స్థాయి కి తీసుకెళ్దాం. నాకు బాధ్యతలు ఇవ్వండి. ఒక్క రూపాయి జీతం తీసుకుంటాను, car కూడా వద్దు. నా సొంత car మాత్రమే వాడుతాను ( జిల్లాలకు కూడా). నేను select చేసుకున్న ఇద్దరు IAS ఆఫీసర్లను (కమీషనర్ , సెక్రటరీ ) ఇవ్వండి. ఇప్పుడు ఉన్న సెక్రటరీ ఎడ్యుకేషన్ ను మార్చండి. నేను చెప్పిన ఇద్దరు సీనియర్ ఇంజనీర్లను ఇవ్వండి. నేను చెప్పిన ఒక సీనియర్ ఫైనాన్స్ ఆఫీసర్ ను ఇవ్వండి. మిగతా అంతా ప్రభుత్వ యంత్రాంగాన్నే ఉపయోగించుకుందాం. అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ పవర్స్ ఇవ్వండి. మీరు 15 రోజులకొకసారి రివ్యూ కి టైం ఇవ్వండి. మీకు విద్యా వ్యవస్థను మార్చి చూపిస్తాను. ప్రస్తుతం పని చేస్తున్న టీచర్లకు లెక్చరర్లకు ఫాకల్టీ కి వాళ్ల సర్వీస్ రూల్స్ వాళ్ల జీత భత్యాలు మార్చాల్సిన అవసరం లేదు. ఇది చేస్తే వచ్చే ఎన్నికలల్లో మీరు గెలుస్తారు. తెలంగాణ లో బ్రహ్మాండమైన విద్యా వ్యవస్థ ఇచ్చిన వాళ్ళము అవుతాము . చరిత్ర లో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
@TelanganaCMO