కాకినాడలోని జేఎన్టీయూలో నిర్వహించిన సీఐఐ ప్రాంతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పెట్టుబడులకు, ప్రగతికి ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని పేర్కొన్నారు.
16 ఎంఓయూల ద్వారా రూ.4,652 కోట్ల పెట్టుబడులు, నాలుగు ప్రత్యేక ప్రాజెక్టులకు రూ.2,090 కోట్లతో శంకుస్థాపనలు కలిపి మొత్తం రూ.6,347 కోట్ల పెట్టుబడులతో 18 వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ
@narendramodi గారి మార్గదర్శకంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ
@ncbn గారి నాయకత్వంలో రాష్ట్రానికి రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు.
సింగపూర్ తరహాలో సమష్టి కృషితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, పరిశ్రమలు కేవలం లాభాలకే పరిమితం కాకుండా దేశాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, పల్లెలు, గిరిజన ప్రాంతాలకూ పెట్టుబడులను విస్తరించి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు.